శివుడి పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు.
ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు చేసి శివలింగాన్ని భక్తితో పూజించాలి. అయితే మహాశివరాత్రి రోజు జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. అలాగే సమస్త పాపాలు నశిస్తాయట.