శివరాత్రి సందర్భంగా అన్ని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శివుడి పూజచేసేందుకు నిషిత కాల సమయం గంట కంటే తక్కువగా వచ్చింది. అది కూడా నిషిత కాల పూజ సమయం అర్థరాత్రి వచ్చింది.
మార్చి 8 అర్థరాత్రి(తెల్లవారితే మార్చి 9) 12.07 గంటల నుంచి 12.56 గంటల వరకు ఉంది. శివరాత్రి పూజలు చేసేందుకు పండితులు తప్పనిసరిగా నిషిత కాల సమయం ఎంచుకుంటారు. శివరాత్రి సమయంలో నిషిత సమయం అంటే శివుడు లింగ రూపంలో భూమిపై కనిపించిన సమయంగా భావిస్తారు.