ఏపీలోని అనంతపురంలో జేఎన్టీయూ సమీపంలో మూర్తిరావు గోఖలే అనే మాజీ ప్రిన్సిపాల్‌ను మేనల్లుడు ఆదిత్య గొంతుకోసి హత్య చేశాడు. భర్త మృతిని తట్టుకోలేకపోయిన మూర్తి భార్య శోభ అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉద్యోగం ఇప్పిస్తానని మూర్తి నిందితుడి వద్ద గతంలో డబ్బులు తీసుకున్నారని, ఆ విషయంలో మాటామాటా పెరిగి గొడవ జరగడంతోనే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa