విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును నమ్మవద్దని రెవెన్యూశాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. పీఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్స్ లో చేయూత సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ..2019లో వైయస్ జగన్ ను నమ్మి ఓటు వేయడం, ఆయన మాట మీద నిబడడం ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేపట్టాం గలిగాం. మరో 3,4 రోజుల్లో ఎన్నికల నోటఫికేషన్ రానుంది. ఈ ప్రభుత్వం నాడు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంది.ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ఎటువంటి లంచాలు లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి డీబీటీ ద్వారా చేర్చగలిగింది. అదేవిధంగా అట్టడుగు వర్గాలు జీవించేందుకు, సామాజిక గౌరవం అందుకునేందుకు అనుగుణంగా పనిచేసింది. ఈ ప్రభుత్వం మాకు తోడుగా ఉంటుంది అన్న భరోసా అందించగలిగింది. ఆ విధంగా భరోసా కలిగేందుకు చర్యలు చేపట్టాం. ఆ దిశగా పాలన సాగించాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సదుద్దేశంతో అన్ని పథకాలనూ ఇంటిని సమర్థంగా నడిపే ఇల్లాలి పేరు మీదనే అమలు చేశాం. చేయూత పథకం వెనుక సీఎం విశాల ఆలోచనా ఉంది. కొంత వయసు వరకూ తల్లిదండ్రులు ఉంటారు. కానీ తరువాత వారికి ఆ తోడు ఉండకపోవచ్చు. కుటుంబ భారం కారణంగా కొందరు స్త్రీలు మరింత ఆర్థికంగా సతమతం కావొచ్చు. 45 ఏళ్ల వయసులో.. స్త్రీ కి తండ్రి లా ప్రతి ఏడాది ప్రభుత్వం అందించే పథకమే వైఎస్ఆర్ చేయూత పథకం. కొడుకు మాదిరి ఆదరించే ఈ పథకం కింద 18,500 ఇస్తున్నాం. ఇప్పటి వరుకు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 కోట్లు అందజేశాం. దర్జాగా,ఎవరికీ లంచం ఇవ్వకుండా ఇచ్చాం. మరి ! ఈ స్థాయిలో గత ప్రభుత్వం పనిచేసిందా అని ప్రశ్నిస్తున్నాను. విపక్ష నేత చంద్రబాబుకు అనుభవం ఉంది అని 2014 లో అధికారం ఇస్తే,మహిళా సంఘాలను మోసం చేశారు. ఇప్పుడు మాత్రం మేం ఇచ్చిన దాని కన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నారు. తన అభివృద్ధి కోసం తన వారి అభివృద్ధి కోసం ప్రయత్నించారే తప్ప.. ఆ రోజు ఆయన పేదల బాగుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కేవలం తన అధికారం కోసమే చూసే వ్యక్తి చంద్రబాబు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే డానికి అధికారం ఉపయోగించే నాయకుడు జగన్. చేంతాడంత హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు కి అధికారం ఇస్తారా ? లేదా మాట మీద నిలబడే జగన్ కి అధికారం ఇస్తారా ? అన్నది మీరే ఆలోచించుకోండి. ఇప్పటి విపక్ష నేత చంద్రబాబుకు 2014 - 19 మధ్య రాష్ట్ర విభజన అనంతరం అధికారం ఇస్తే దోచుకు తిన్నారు. పెట్టెలోని డబ్బులు పెట్టి దోచుకున్నారు. అదే వైయస్ జగన్ కు ఇస్తే పేదల వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఏమీ దక్కని వర్గాలను ఆదుకుని,ప్రభుత్వమే బాధ్యతగా వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తోంది. ఇందుకు అర్హతనే ప్రామాణికంగా తీసుకని పని చేస్తోంది. ఇవాళ పాలనలో వచ్చిన మార్పులను గమనించండి. సంస్కరణల ఫలితాలను ఒక్కసారి గమనించండి అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు.