ధర్మవరం నుంచి ఈనెల 24న అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామని ఆర్టీసీ డీఎం వెంకట సత్యనారాయణ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఉదయం 6 గంటలకు ధర్మవరం నుంచి బస్సు బయలుదేరుతుందని రానుపోను చార్జీ రూ. 1400గా నిర్ణయించామన్నారు. అరుణాచలం గిరిప్రదక్షిణ, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం భక్తులు చేసుకోవచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa