యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారని, అసలు బ్యాంక్ లోన్ అనేపదం బాబు నోట ఎందుకు వచ్చిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నించారు. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా? అని నిలదీశారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు ఎలా చదువుకోవాలి?. పిల్లల చదువులతో ప్రభుత్వానికి పనిలేదా? అని మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ మీడియాతో మాట్లాడారు. బాబు వస్తేనే జాబు వస్తుందన అప్పట్లో ప్రచారం చేసి, చివరికి ఆయన కొడుకు నారా లోకేష్‌కు మాత్రమే పదవులు ఇచ్చుకున్నారని గుర్తుచేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగులను నిలువునా మోసం చేశాడని మండిపడ్డారు. ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనన్న చంద్రబాబు, ప్రత్యేక హోదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ఎందుకు అనలేదని ఎంపీ భరత్ ప్రశ్నించారు.