ఆంధ్రప్రదేశ్‌లో ‘అభివృద్ధి.. సంక్షేమం.. సామాజిక న్యాయం’ను చూపెడుతూ మరోసారి అధికారం దక్కించుకునే దిశగా వైయస్ఆర్‌సీపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గరిష్టంగా శాసన సభ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను(ఇన్‌ఛార్జిలను) నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అభ్యర్థుల తుది ప్రకటనకు రంగం సిద్ధమైంది. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16వ తేదీన వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. వైయస్ఆర్ ఘాట్ వేదికగా.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్‌ను ఆయన ప్రకటించారు. 16వ తేదీ నాటి ప్రకటన అనంతరం సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని సమాచారం.