ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కర్ణాటక నుంచి ప్రారంభించనున్నారు. ఈ నెల 16వ తేదీన మల్లికార్జున్ ఖర్గే గతంలో ప్రాతినిధ్యం వహించిన కాలబురగి నుంచి క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ మేరకు బీజేపీ కర్ణాటక జనరల్ సెక్రటరీ వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాలబురగి జిల్లా నివాసి. 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన గెలిచారు. కానీ, గత లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa