ఐరన్ లంగ్స్‌తో 72 ఏళ్లు జీవించిన యూఎస్‌కు చెందిన పాల్ అలెగ్జాండర్(78) కన్నుమూశారు. 1946లో జన్మించిన ఈయన 6 ఏళ్లకు పోలియో బారిన పడ్డారు. మెడ నుంచి కాళ్ల వరకు పక్షవాతానికి గురై ఊపిరి తీసుకోలేకపోయారు.
దీంతో శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే కృత్రిమ ఐరన్ లంగ్స్‌ను వైద్యులు ఈయనకు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ కవచంలోనే కదలకుండా ఉండిపోయారు. దీంతో ‘పోలియో పాల్’, ‘ది మ్యాన్ ఇన్ ది ఐరన్ లంగ్’గా ప్రసిద్ధికెక్కారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa