నా చుట్టూ కోటరీ కట్టాలని చూస్తే దానిని ఎప్పటికప్పుడు బద్దలు కొడతాను అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అయన మాట్లాడుతూ... పైకి మెత్తగా కనిపిస్తాడు కదా ఆడేసుకుందాం అనుకుంటే, వాళ్లతో నేనే ఆడేసుకుంటాను. టీ, కాఫీలు అందించి ఎమ్మెల్యేలు అయిపోదాం అనుకుంటే కుదరదు. నన్ను బ్లాక్‌మెయిల్ చేయాలనుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పార్టీలో ఉండి కోవర్టులుగా పనిచేసే వాళ్లను వదిలేది లేదు. పని చేసే వారిని ఎలా గుర్తిస్తానో, నా చుట్టూ ఉండి నమ్మక ద్రోహం చేసినవారిని వదిలిపెట్టను. ఒక సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అప్పటికే రాజకీయాల్లో ఉన్నవారు వారి వికృత రూపాన్ని ఎలా చూపిస్తారో 2006లోనే అర్థమైంది. పొత్తులో బీజేపీ చేరడం వల్ల జగన్ తోక కత్తిరిస్తాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి పొత్తును గెలిపించండి. జనసేనను ఆశీర్వదించండి. మీకు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను అని పవన్ హామీ ఇచ్చారు.