తాను ప్రజల కోసం ఆలోచిస్తుంటే.. తన మిత్రుడు త్రివిక్రమ్ మాత్రం తన గురించి ఆలోచించాడని పవన్ చెప్పారు. తన కోసం ప్రత్యేకంగా స్క్రిప్టులు రాసి.. సినిమాలు తెచ్చి పెట్టాడన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం ఆయనకు అసలు ఇష్టం లేదన్నారు. జల్సాలో అనేక డైలాగ్‌లు రాసి.. రాజకీయాలకు వెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేశాడని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. ఆయన మాట వినకుండా రాజకీయాల్లోకి వచ్చానని, అయినప్పటికీ త్రివిక్రమ్ తనను భరిస్తూనే ఉన్నాడన్నారు. ‘నన్ను నా కుటుంబం, నా రక్తం ఎంత అర్థం చేసుకుందో తెలియదు కానీ.. ఎక్కడెక్కడో ఉన్న వారు నన్ను చాలా అబిమానిస్తారు.. అర్థం చేసుకుంటారు.’ అని పవన్ కల్యాణ్ అన్నారు.