ఉక్రెయిన్పై రష్యా దాడులు ఆగడం లేదు. శుక్రవారం ఉక్రెయిన్పై మరోమారు భీకరంగా విరుచుకుపడింది. మాస్కో ప్రయోగించిన క్షిపణులు ఒడెసా నగరంలో 16 మంది ప్రాణాలను కోల్పోయారు. 53 మందికి గాయాలయ్యాయి.
తొలి క్షిపణి నివాస గృహాలపై పడింది. అక్కడికి సహాయక సిబ్బంది చేరుకున్న సమయంలో మరో క్షిపణి అదే ప్రాంతాన్ని తాకింది. చనిపోయిన, గాయపడిన వారిలో వైద్య, అత్యవసర సిబ్బంది అధికంగా ఉన్నారు.