కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగిసింది. మణిపూర్ నుంచి ముంబై వరకు 63 రోజులపాటు ఈ యాత్ర కొనసాగింది.
సెంట్రల్ ముంబైలోని బీఆర్ అంబేడ్కర్ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన రాహుల్ రాజ్యాంగ పీఠికను చదివారు. ఇక ఆదివారం మణిభవన్ నుంచి ఆగస్టు క్రాంతి మైదాన్ వరకు ‘న్యాయ్ సంకల్ప్ పాదయాత్ర’ నిర్వహించనున్నారు.