రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది.. అదే సమయంలో అభ్యర్థుల వెన్నులో వణుకు కూడా మొదలైంది. ఈసీ ప్రకటించిన ఎన్నిక షెడ్యూల్‌లో పోలింగ్ తేదీ ఏకంగా 59రోజులు ఉండటంతో.. ‘అమ్మో.. అన్ని రోజులా’ అని అభ్యర్థులు కలవరపడుతున్నారు. దక్షిణాదిలో ఎన్నికలంటేనే కోట్లాది రూపాయలు ఖర్చు చేయాలి. గత ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక, డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా వందల కోట్ల రూపాయలు తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఏపీలోనూ ఇదే స్థాయిలో అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ వెలువడిన మార్చి 16నుంచి పోలింగ్ జరిగే మే 13వరకూ అనుచరులు, కార్యకర్తల్ని అభ్యర్థులు భరించాలంటే....భారీగా ఖర్చు చేయాల్సిందే. ప్రతి రోజూ కనీసం రూ.ఐదు లక్షల నుంచి సభలు, ఇతరత్రా కార్యక్రమాలను బట్టి పాతిక ముప్పై లక్షల వరకూ ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి. అలా చెయ్యకపోతే వెంట నడిచేవారు కూడా జారిపోతారని భయం. భోజనాలు, వాహనాలు, డీజేలు, ఫ్లెక్సీలు, కళాకారులు...ఒకటా రెండా ప్రతి రోజూ ఖర్చు చేస్తూనే ఉండాలి. కాగా, లోక్‌సభకు, 4 రాష్ట్రాల అసెంబ్లీలకు, ఉప ఎన్నిక స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో నాలుగో విడతలో, మే 13న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa