85 ఏళ్ల వయసు దాటిన వాళ్లందరికీ, 40 శాతానికి మించి అంగ వైకల్యం కలిగిన వారికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇంతకుముందే పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టామని, ఈసారి దేశమంతటా అమలు చేస్తున్నామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జమ్ము కశ్మీర్ శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లో జమ్మూ కశ్మీరు కూడా ఉంది.