ఏపీలో ప్రజల అండదండలు ఉన్నప్పటికీ ప్రశ్నించే గొంతుకలు మూ గబోయాయని తెలంగాణ సీఎం ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ పాలకులు కావాలని అనుకుంటున్నారే తప్ప.. ప్రశ్నించే గొంతుకలు కావాలనుకోవ డం లేదని దుయ్యబట్టారు. ఏపీ నాయకులకు ప్రశ్నించేతత్వం లేనందునే ఈ రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా పో లవరం పూర్తి కాలేదనీ, ప్రత్యేక హోదా రాలేదనీ, అమరావతి రాజధాని నిర్మాణం జరగలేదనీ అన్నారు. ఢిల్లీ వెళ్లి వంగి వంగి నమస్కారాలు పెట్టేవారున్నారు తప్ప ఏపీ లో ప్రధాని మోదీని నిలదీసే నాయకులు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి విశాఖ ఉక్కునగరంలో ని తృష్ణా మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ న్యా య సాధన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా అందరూ కలిసి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కురుక్షేత్రంలో కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం జరిగింద ని, కానీ తమపైకి ఎవరైనా వస్తే వారు 105 మంది ఏక మై పోరాటాలు చేశారన్నారు. 32 మంది ప్రాణత్యాగాల తో సాఽధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదానీకి ప్రధాని మోదీ విక్రయిస్తుంటే పహిల్వాన్‌లమని చెప్పుకొంటున్న నాయకులు ప్రశ్నించడం లేదని విమర్శించా రు. ‘‘ఆంధ్రప్రదేశ్ అంటే దివంగత నేతలు నీలం సంజీవరెడ్డి, నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వెంకయ్యనాయుడు గుర్తుకొస్తారు. వారి హయాం లో ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం జరిగితే నిలదీసేవారు. ప్రస్తుతం ప్రశ్నించే నాయకులు ఏపీలో లేరు’’ అని అన్నారు.