ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నేత దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2024, 03:53 PM

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్తి బూర్ల రామాంజనేయులు వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్‌ ఇంటిపై స్వయంగా దాడికి తెగ­బ­డ్డారు. బుధవారం మధ్యాహ్నం కార్లు, ఇతర వాహ­నాలపై 200 మంది టీడీపీ, జనసేన రౌడీలతో, మారణాయుధాలతో వచ్చి రామాంజనేయులు ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న వారిని కార్లతో తొక్కించే ప్రయత్నం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో పలాయనం చిత్తగించారు. ఈ దాడిలో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ముగ్గురికి గాయాల­య్యా­యి. పూర్తిసమాచారం తెలియాల్సిఉంది 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa