ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 పరీక్ష అంశంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండవ సారి, మూడవ సారి మూల్యాంకం చేయడం చట్ట విరుద్దమని ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది. తర్వాతి విచారణను రాష్ట్ర హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa