ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 'స్కామ్' కేసుపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీ దాడులు జరిపిన చర్యను ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా తప్పుబట్టారు. కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉందని రాఘవ్ చద్దా అన్నారు. సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందే అరెస్ట్ చేయడం దేనికి నిదర్శనం? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ కు కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ఆయనను టచ్ చేయడం ఎవరి వల్లా కాదని రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. 'ఆప్ ప్రభుత్వాలు కొనసాగుతున్న ఢిల్లీ, పంజాబ్‌లలో అద్భుతమైన పనుల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఆయన శరీరాన్ని అరెస్ట్ చేయగలరేమో కానీ, ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను అరెస్ట్ చేయలేరు" అంటూ రాఘవ్ చద్దా అన్నారు.
.