మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం 12 మందితో కూడిన ఈడీ బృందం సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. పలు ప్రశ్నలు సంధించిన తర్వాత కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు వైద్య పరీక్షలు నిర్వహించి రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో విచారణకు కస్టడీ ఇవ్వాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది.