ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్-భూటాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. భూటాన్‌లో నూతన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భారత్ అంగీకరించింది.
అస్సాంలోని కోక్రాజర్, బెంగాల్‌లోని బనర్‌హట్ నుంచి భూటాన్‌కు రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు డీల్ కుదుర్చుకుంది. 2019-2024 మధ్య రూ.5వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన భారత్ రానున్న ఐదేళ్లకు దానిని డబుల్ (రూ.10వేలకోట్లు) చేసింది.