వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న 26 మంది వాలంటీర్లను ఎన్నికల అధికారులు విధుల నుంచి తొలగించారు. పలువురికి నోటీసులు జారీ చేశారు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని 36, 38వ సచివాలయాలకు చెందిన ఇద్దరు వాలంటీర్లను తొలగించారు. ప్రత్తిపాడులో 12 మంది, కిర్లంపూడిలో ముగ్గురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో నలుగురిని విధుల నుంచి తొలగించారు.