ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో MLA అభ్యర్థిని జనసేన పార్టీ ఖరారు చేసింది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు బరిలో దిగనున్నారు.
బాలరాజుకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మూడు పార్టీల(టీడీపీ, జనసేన, బీజేపీ) శ్రేణులను కలుపుకొని పని చేస్తానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa