‘టీడీపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని వేధించేందుకు ఇంటెలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీ పీఎ్‌సఆర్ ఆంజనేయులు సిబ్బందిని నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ట్యాప్ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. శనివారం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావు తచ్చాడుతూ ఫేక్ ఐడీ కార్డుతో పట్టుబడ్డారని తెలిపారు. ఇంటిలిజెన్స్ విభాగం నుంచి వచ్చానని, టీడీపీ నిర్వహించే మీటింగ్ ఫీడ్‌బ్యాక్ ఇంటెలిజెన్స్‌కు అందించేందుకు వచ్చానని తెలిపారన్నారు. కానిస్టేబుల్ ఫోన్‌ను పరిశీలించగా విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేసినట్లు తెలిసిందన్నారు. పీఎ్‌సఆర్ ఆంజనేయులు టీడీపీ నేతలఫోన్లు ట్యాప్ చేసేందుకు పెగాసెస్ సాఫ్ట్‌వేర్ వాడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని కోరారు.