మూడు వారాల నుంచి ఎండలతో రాయలసీమ మండిపోతోంది. శనివారం దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈనెల 27 వరకు ఎండ వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.