లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ.. తన గెలుపు గుర్రాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే.. నాలుగు విడతల్లో మొత్తం 291 అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. ఇప్పుడు ఐదో జాబితా కూడా విడుదల చేసింది. తొలి విడతలో ఒకేసారి 195 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన బీజేపీ.. రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులను, మూడో జాబితాలో కేవలం 9 మంది అభ్యర్థులను, 15 మంది పేర్లతో నాలుగో లిస్టును ప్రకటించింది. ఇక.. ఇప్పుడు ఐదో జాబితాను ప్రకటించిన బీజేపీ.. ఈ లిస్టులో ఏకంగా 111 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో.. ఇప్పటి వరకు మొత్తం 402 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. అయితే.. ఇప్పటికే ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో పలువురు సినీ నటులు ఉండగా.. ఐదో జాబితాలోనూ సినీ గ్లామర్ ఉండేలా జాగ్రత్తపడింది బీజేపీ. హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి హీరోయిన్ కంగనా రనౌత్‌ను రంగంలోకి దించుతోంది కమలం పార్టీ. మరోవైపు.. రామయణంలోని రాముని పాత్రదారుడైన అరుణ్ గోవిల్‌కు కూడా టికెట్ ఇచ్చింది కమలం పార్టీ. యూపీలోని మీరట్ నుంచి అరుణ్ గోవిల్‌ను పోటీకి దించుతోంది బీజేపీ.
ఐదో జాబితాలో.. ఉజియార్‌పూర్ నుంచి నిత్యానంద్ రాయ్, బెగుసరాయ్ నుంచి గిరిరాజ్ సింగ్, పాట్నా సాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, దుమ్కా నుంచి సీతా సోరెన్, బెల్గాం నుంచి జగదీశ్ షెట్టర్, బెల్గాం నుంచి జగదీశ్ షెట్టర్, ఢారంభళ్లాపూర్ నుంచి కే సుధాకరన్ బరిలోకి దిగారు. సంబల్పూర్, బాలాసోర్ నుండి ప్రతాప్ సారంగి, పూరీ నుండి సంబిత్ పాత్ర, భువనేశ్వర్ నుండి అపరిజిత సారంగి మరియు మీరట్ నుండి అరుణ్ గోవిల్, ఇతర అభ్యర్థులలో ఉన్నారు.
ఇతర అభ్యర్థులలో జునాగఢ్ నుండి రాజేష్ చుడాసమా, మెహసానా నుండి హరి పటేల్, సబర్‌కాంత నుండి షబ్నా బెన్ బరియా, వడోదర నుండి డాక్టర్ హేమాంగ్ జిషి, అమ్రేలీ నుండి భరత్ భాయ్ సుతారియా, సురేంద్రనగర్ నుండి చందూభాయ్ షియోహోరాలను పార్టీ ప్రకటించింది. వడోదర, సబర్‌కాంత అభ్యర్థులను బీజేపీ మార్చి.. మళ్లీ ప్రకటించింది. ముందుగా పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లను ఈరోజు ముందుగానే వెనక్కి తీసుకుంది.
ఇక.. కంగనా రనౌత్ చాలా రోజులుగా బీజేపీ పార్టీతో మంచి సంబంధాలు కంటిన్యూ చేస్తోంది. మోదీ తీసుకునే నిర్ణయాలకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలుపుతుండటం తెలిసిందే. మరోవైపు.. ఆయోధ్య రామమందిర ప్రారంభ సమయంలోనూ.. కంగనా సెంటర్ ఆఫ్ అట్రక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే.. కంగనాకు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ దక్కటం గమనార్హం. కాగా.. ఇప్పటికే ప్రకటించిన జాబితాలో విరుధ్ నగర్ స్థానానికి సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌ను ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం.
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు..
బీజేపీ ప్రకటించిన ఐదో జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. ఏపీలోని ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తెలంగాణ నుంచి రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే.. వరంగల్ స్థానానికి ఇటీవలే బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ పేరు ఖరారు చేయగా.. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావును ప్రకటించింది.