ఇటీవల బ్రిటన్ రాజకుటుంబంలో జరుగుతున్న పరిణామాలను యావత్తు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. గత మూడు నెలలుగా బయట ప్రపంచానికి యువరాజు విలయమ్ భార్య, వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ కనిపించకపోవడంతో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఏదో కుట్ర జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ, చివరకు ఊహాగానాలకు కేట్ తెరదించుతూ.. తనకు కేన్సర్ సోకినట్టు ప్రకటించి షాకిచ్చారు. ఇదే సమయంలో ఆమె మామ, కింగ్ ఛార్లెస్ కూడా కేన్సర్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో 15వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ జ్యోతిషుడు నోస్ట్రాడమస్.. బ్రిటన్ రాజకుటుంబ భవిష్యత్తు గురించి చెప్పిన జోస్యం తెరపైకి వచ్చింది. ఆయన చెప్పినట్టుగానే క్వీన్ ఎలిజబెత్UK Royal Family Health, Nostradamus Predictions, Nostradamus On UK Royal Family, UK Royal Family, యూకే రాజకుటుంబం, రాజకుటుంబంలో ఆరోగ్యం, నోస్ట్రాడామస్ జ్యోతిషంII మరణం, హిరోషిమాపై బాంబు దాడి, నెపోలియన్ ఎదుగుదల అంచనాలు నిజమయ్యాయి. అలాగే, 2024లో బ్రిటన్ రాజవంశానికి కష్టాలు తప్పవని ముందే హెచ్చరించడం గమనార్హం.
శతాబ్దాల కిందట నోస్ట్రాడమస్ రాసిన పుస్తకాల్లో బ్రిటన్ రాజుగా ఊహించని వారసుడు వస్తాడని తెలిపారు. ‘బలవంతంగా తరిమివేయబడి.. గుర్తింపులేని వ్యక్తి రాజుగా పదవిలో కూర్చుంటాడు’ అని జోస్యం చెప్పారు. దీంతో కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న ప్రిన్స్ హ్యారీ తదుపరి రాజుగా పట్టాభిషిక్తుడవుతాడా? అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కింగ్ చార్లెస్ ప్రొస్టేట్ కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, రాచరిక బాధ్యతలపై అంతగా ఆసక్తి చూపని ప్రిన్స్ హ్యారీ రాజుగా ఎలా మారతాడు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.
కేట్ మిడిల్టన్ ఆరోగ్యం గురించి ఇటీవలి వెల్లడైన నేపథ్యంలో ఆధునిక నోస్ట్రాడమస్, బ్రెజిల్‌కు చెందిన 36 ఏళ్ల అథోస్ సలోమ్ అంచనాలు కూడా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వేల్స్ యువరాణి ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి, ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) కొనుగోలు వంటి ప్రధాన సంఘటనలను తాను ముందే ఊహించినట్లు సలోమ్ తెలిపారు. రాబోయే రోజుల్లో యువరాణి కేట్ తీవ్రమైన అనారోగ్యానికి గురువుతుందని జోస్యం చెప్పారు. అయితే, రాజకుటుంబంగా భవిష్యత్‌లో ఆమె పాత్ర ఉందని ఆధ్యాత్మికవేత్త చెప్పడం గమనార్హం.
దీనిపై ఎక్స్‌లో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘నోస్ట్రాడోమస్ జోస్యం ఫలించింది.. కేట్ మిడిల్టన్ కేన్సర్ బారినపడింది.. బ్రిటన్ రాజు తప్పనిసరిగా పదవి నుంచి దిగి ప్రిన్స్ హ్యారీకి సింహాసనం అప్పగించాలి ఎందుకంటే ఇంగ్లాండ్ రాజుగా అవసరాలను విలియమ్ తీర్చలేడు’ అని అన్నారు. ఇటీవలి బ్రిటీష్ రాజకుటుంబంపై జరుగుతోన్న ప్రచారం, ఊహాగానాలు వారి భవిష్యత్తుపై చర్చకు తెరతీస్తున్నాయి.