పెందుర్తి నగరంలో వ్యాపారం చేసుకునే పంచకర్ల రమేశ్‌బాబు ప్రజారాజ్యం ఏర్పాటుతో రాజకీయాల్లో ప్రవేశించి 2009లో పెందుర్తి నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. 2014లో టీడీపీలో చేరి ఎలమంచిలి నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత వైసీపీలో చేరి పార్టీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ ఇమడలేక జనసేనలో చేరారు. కూటమి మధ్య సీట్ల పంపకంలో భాగంగా పెందుర్తి నుంచి పంచకర్లకు అవకాశం లభించింది.