పద్మనాభంలోని అనంత పద్మనాభుని రథోత్సవం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవానికి ముందు నిత్య హోమం, రథాంగ హోమం, మహాశాంతి హోమం, గ్రామ బలిహరణ, వైదిక సదస్సు జరిగాయి. సాయంత్రం రథ చక్రాలకు పూజలు చేసిన అనంతరం వేలాదిగా తరలి వచ్చిన భక్తుల గోవింద నామస్మరణ మధ్య రథాన్ని రాజవీధి మీదుగా ఊరేగించారు. తిరువీధిలో దారి పొడవునా భక్తుల నీరాజనాల నడుమ అనంతుడు ప్రత్యేక పూజలు అందుకున్నారు.