టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ పార్టీకి నరసాపురం పార్లమెంట్, కైకలూరు స్థానాలను కేటాయించారు. కైకలూరులో రాజకీయ అనుభవం వున్న మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపించింది. మూడు పార్టీల కూటమి ఏర్పడినప్పటి నుంచి డాక్టర్ కామినేని పేరు కైకలూరులో పిక్స్ అయినట్లేనని అంతా భావించారు. తాజా సమాచారం మేరకు కామినేని అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేశారు. ఒక దశలో ఏలూరు లోక్‌సభ స్థానం బీజేపీ పక్షాన ఆశించిన తపనా చౌదరిని ప్రత్యామ్నాయంగా కైకలూరు అసెంబ్లీ స్థానానికి వెళతారా అని పార్టీ పెద్దలు కోరారు. అయితే తాను ఎంపీ స్థానంలో మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాని, టీడీపీ ఏలూరు లోక్‌సభ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.