నిరుద్యోగులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. తాడేపల్లిలోని ఫైన్ఉడ్ అపార్ట్మెంట్ వాసులతో నారా లోకేశ్ భేటీ అయ్యి మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు నియామకాలు చేపడతామని, పోలీసు నియామకాలన్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలను నిషేధిస్తామన్నారు. లోకేశ్‌తో పాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు.