ఏపీలో అరాచకాలను అంతమొందించాలనే ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయన్నారు. మూడు పార్టీల ఎజెండా ఒక్కటేనని.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ తమ ఎజెండా అని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ సీట్లు, 24 లోక్ సభ సీట్లు గెలుస్తామని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రూ.4వేలు పింఛన్ ఇస్తానని, ఇంటివద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు.
ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పించారు. వచ్చే ఐదేళ్లలో కుప్పను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు నాదే. జగన్ అంటే వై 175 కాదు.. పులివెందుల ఎందుకు కాదు.. పిలుస్తున్నాను. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు అన్నారు.