ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి బ్యాడ్‌న్యూస్. ఈ నెల పింఛన్లు ఆలస్యంగా పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వం అందజేస్తోంది. అయితే ఈసారి మాత్రం ఆలస్యం కాబోతున్నాయి. ఈసారి పింఛన్లు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1న కాకుండా ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. పింఛన్లు తీసుకునేవారు ఈ విషయాన్ని అర్దం చేసుకోవాలని అధికారులు కోరారు. ఏప్రిల్ నెలకు మాత్రమే ఇలా ఆలస్యం అవుతుంది అంటున్నారు.
ప్రతి జిల్లాలో ఏప్రిల్ నెలలో పింఛన్లు ఆలస్యం అవుతాయని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీసత్యసాయి జిల్లాలో అధికారులు పింఛన్ల ఆలస్యంపై ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లకు ఈ విషయాన్ని తెలియజేశారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుందని.. మార్చి 31న, ఏప్రిల్ 1న బ్యాంకులు పనిచేయని కారణంగా ఏప్రిల్ 1న పంపిణీ చేయాల్సిన పింఛన్లు ఏప్రిల్ 3 (బుధవారం) నుంచి పంపిణీ చేస్తారని ప్రభుత్వం నుంచి ఆదేశాలు తమకు అందినట్లు తెలిపారు.
పింఛన్లపై ఉత్తర్వులు
కావున ఈ సమాచారాన్ని జిల్లాలోని అందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తమ తమ మండలం, మున్సిపల్ పరిధిలోని పింఛన్ లబ్ధిదారులకు తెలియజేయాలని కోరారు. అలాగే ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున పింఛన్ డబ్బు బట్వాడా చేయుటకు బ్యాంకుల వారిని ఇబ్బందులు ఉండే అవకాశం ఉండటంతో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు అందరు సంబంధిత బ్యాంకు మేనేజర్‌లతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. పింఛన్‌లను ఏప్రిల్ 1 బదులు ఏప్రిల్ 3న పంపిణీ చేస్తారు.