చిలమత్తూరు సమీపంలో సోమవారం తనిఖీ అధికారులకు పట్టుబడ్డ బంగారు ఆభరణాలు మూడు రోజుల నుంచి చిలమత్తూరు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి. పట్టుబడ్డ బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాల పరిశీలన పూర్తి కావటంతో ప్రస్తుతం పోలీసులకే ఈ బంగారం అప్పగించడంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బీఎస్ ఎఫ్ పోలీసులతో ఎస్ఐ గంగాధర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రూ. 30కోట్లు విలువ చేసే ఈ బంగారానికి సంబంధించిన బిల్లులు, ఆభరణాలు సక్రమంగా ఉన్నాయని సహాయ ఎన్నికల అధికారి భాగ్యలత, డిప్యూటీ కమర్షియల్ ఆఫీసర్ సి. మధుసూదన్రెడ్డి పరిశీలనలో తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa