మా కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చినా పరిటాల కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. గురువారం రాప్తాడు లో జరిగిన ప్రజా గళం సభలో ఆమె మాట్లాడుతూ. రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. పేరూరు ప్రాజెక్టుకు రూ. 804 కోట్లు విడుదల చేశారన్నారు.