ఎన్నికల కోడ్ అమలులో భాగంగా శుక్రవారం సాయంత్రం కాజా టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే ఆర్కే వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే పోలీసుల విధులలో భాగమైన వాహన తనిఖీకి ఎటువంటి ఆటంకం తెలుపకుండా పోలీసు వారికి సహకరించినట్లు చెప్పారు. ఎన్నికల నియమావళిలో భాగంగా ఉన్నతాధికారులు సూచనలతో వాహనాలు తనిఖీ చేపట్టామని పోలీసులు ఆయనకు తెలిపారు.