కానూరు కార్మెల్ మాత పుణ్యక్షేత్రం విచారణ ఫాదర్ చాలివేంద్ర శౌర ఆధ్వర్యంలో సాలిపేట నుండి బందరు మెయిన్ రోడ్డు ద్వారా కానూరు కార్మెల్ మాత చర్చి వరకు ఉదయం 10 గం..ల ఏసు క్రీస్తు పడిన కఠోర శ్రమ పద్నాలుగు స్థలాల సజీవ స్లీవమార్గం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ పరిశుద్ధమైన స్లీవమార్గంలో దీక్షాపరులు, సాలిపేట, గంగూరు, పోరంకి, కమయ్యతోపు, కానూరు, వివిధ గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి ఉపవాస ప్రార్ధనలో పాల్గొన్నారు. సి.టి.సి. సిస్టర్స్, ఉపదేశకులు, పారిస్ కౌన్సిల్ సభ్యులు, గాయక బృందం ఆలపించిన ఆరాధన గీతాలు అందరిని భక్తి మార్గంలో నడిపించాయి. అనంతరం కార్మెల్ మత చేర్చిలో ఫాదర్ చాలివేంద్ర శౌరి ఫాదర్ దేవదానం, ఫాదర్ రత్నరాజ్ దివ్యబలి పూజా సంఘ్యాలను సమర్పించి భక్తులకు దివ్య సప్రసాదం అందించారు. భక్తులందరికి మండ్రు అబ్రాహాం జ్ఞాపకార్ధం మండ్రు ఫణీంద్ర కుటుంబ సభ్యులు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. భక్తులు పదిహేను వందల మంది పైన పాల్గొన్నారని, యూత్ వారి సజీవ పాత్రల వేషాదరణ అందరిని ఆకట్టుకుందని కార్మెల్ మాత పుణ్యం ఫాదర్ చాలివేంద్ర శౌరి తెలిపారు.