మంగళగిరి పరిధిలోని కాజ టోల్ గేట్ వద్ద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వాహనాన్ని శుక్రవారం పోలీసులు తనిఖీలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మంగళగిరి నుండి పెదకాకాని వెళుతుండగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే వాహన తనిఖీకి పూర్తిగా సహకరించి వాహనాన్ని క్షుణ్ణంగా పోలీసులకు చూపించారు. అనంతరం ముందుకు సాగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa