లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 17, 18 తేదీల్లో 2 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ విడుదల చేసిన ప్రకటనలో... 100 శాతం ఓటింగ్ నమోదుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిందన్నారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు వెళ్లే వారి సౌకర్యార్థం ఏప్రిల్ 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. నగరం నుంచి ప్రధాన నగరాలు, జిల్లాలకు 2,000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ కోసం వసతి కల్పించినందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.