ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 08:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. Southwest రైల్వే జోన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు, పాక్షిక రద్దుచేసి మరికొన్నింటిని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బెంగళూరు-ధర్మవరం-బెంగళూరు (06595/96) రైలును ఏప్రిల్‌ 3, 10 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ రైళ్లను ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో గౌరీబిదనూరు-ధర్మవరం సెక్షన్‌లో రద్దుచేసి, గౌరీబిదనూరు-బెంగళూరు మధ్య మాత్రమే నడపనున్నట్లు వివరించారు.


అలాగే జైపూర్‌-మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 12976) రైలును ఏప్రిల్‌ 1, 8 తేదీల్లో గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా కాకుండా గుంతకల్లు, బళ్లారి, రాయదుర్గం, అరిసికెరె, హసన్‌ స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్‌ మరమ్మతు పనుల కారణంగా కలబురగి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22231) రైలును ఏప్రిల్‌ 3, 10 తేదీల్లో ఐదున్నర గంటల ఆలస్యంగానూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 22232)ను ఇవే తేదీల్లో గంట ఆలస్యంగానూ నడుస్తాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com