ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. ఆదివారం తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో నారా లోకేశ్ మాట్లాడుతూ..
ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇంటి పన్ను తగ్గిస్తామన్నారు. అలాగే ఇసుక అమ్మకాలపై పాత విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడుతున్న మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని లోకేశ్ చెప్పుకొచ్చారు.