1985లో రాజీవ్ గాంధీ 52వ రాజ్యాంగ సవరణతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక పార్టీ నుంచి MP, MLA, MLCగా గెలిచి మరో పార్టీలో చేరడం, విప్ కు వ్యతిరేకంగా సభలో ఓటు వేస్తే అనర్హతకు గురవుతారు.
గెలిచిన పార్టీకి రాజీనామా చేసినప్పుడు, నామినేటెడ్ సభ్యులు పార్టీలో చేరినప్పుడూ చట్టం వర్తిస్తుంది. అయితే పార్టీ మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మరో పార్టీలో చేరినా, గ్రూపుగా ఏర్పడినా చట్టం వర్తించదు.