ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో ఓ మహిళను కిడ్నాప్ చేసి నడిరోడ్లపై నగ్నంగా ఊరేగిస్తూ గాజా స్ట్రిప్‌కు తీసుకెళ్లింది. తాజాగా ఆ ఫోటోకు తాజాగా ఫోటో ఆఫ్ ది ఇయర్‌గా నిలవడం తీవ్ర దుమారానికి కారణం అయింది. హమాస్ అకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ చిత్రానికి ఉత్తమ ఫొటో అవార్డు దక్కడం తీవ్ర వివాదానికి కారణం అయింది. ఆ ఫొటోకు ప్రథమ బహుమతి ఇవ్వడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. గతేడాది ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడిన హమాస్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి నరమేధం సృష్టించారు. ఇజ్రాయెల్‌తోపాటు ఇజ్రాయెల్ గడ్డపై ఉన్న విదేశీ పౌరులను కూడా హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లి బంధించారు.
ఆ సమయంలోనే జర్మనీ పర్యాటకురాలు షానీ లౌక్‌ను బంధించి నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. సోషల్ మీడియా వేదికగా హమాస్ ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో హమాస్ ఉగ్రవాదులను అణిచివేయాలనే వాదనలు వెల్లువెతత్తాయి. తాజాగా ఆ ఫొటోకు ఓ కాంపిటిషన్‌లో ఉత్తమ చిత్రం అవార్డు దక్కడం వివాదానికి కారణం అయింది.
ఇటీవల అమెరికాకు చెందిన డొనాల్డ్ డబ్ల్యూ.రెనాల్డ్స్ జర్నలిజం ఇన్‌స్టిట్యూట్.. వివిధ కేటగిరీల్లో పిక్చర్స్ ఆఫ్ ఇయర్ ఇంటర్నేషనల్ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఓ ఫొటోకు గాను అసోసియేటెడ్ ప్రెస్‌కు మొదటి బహుమతి లభించింది. షానీ లౌక్‌ను హమాస్ మిలిటెంట్లు నగ్నంగా ఊరేగించిన ఫోటోకు ఈ అవార్డు రావడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెట్టింట భారీగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన ఫోటోను ఉత్తమ ఫొటోగా ఎంపిక చేయడం ఏంటని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోను అవార్డు ఆర్గనైజర్లు తొలుత బ్లర్ చేయకుండానే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ తర్వాత దాన్ని తొలగించారు.
ఇజ్రాయెల్‌లో సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో 2023 అక్టోబరు 7 వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఆ ఈవెంట్‌పై దాడికి తెగబడ్డారు. గాజా స్ట్రిప్‌కు సరిహద్దుకు సమీపంలో హమాస్ ఉగ్రవాదులు చేసిన భీకర దాడిలో ఘటనా స్థలంలోనే 260 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. కొందర్ని బందీలుగా చేసి.. హమాస్ ఉగ్రవాదులు గాజాకు తీసుకెళ్లారు.