ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త మర్మాంగంపై వేడి నీళ్లు పోసిన భార్య.. కారణం తెలిస్తే షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2024, 09:59 PM

ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ భార్య తన భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తన అత్తామామలు భార్య సాయంతో తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన నాయిని ప్రభుదాస్‌కు, అనూషతో వివాహమైంది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ సఖ్యతగానే ఉంటూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే పెద్దల సమక్షంలో ఇటీవలే ఇద్దరూ రాజీకీ వచ్చారు.అనూష తల్లిదండ్రులకు పెద్దలు నచ్చజెప్పడంతో ఆమెను తిరిగి కాపురానికి పంపించారు.


అలా పెద్దలు నచ్చజెప్పడంతో అనూష ఇటీవలే తిరిగి కాపురానికి వచ్చింది. అయితే కాపురానికి వచ్చినప్పటికీ ప్రభుదాస్, అనూషల మధ్య మాత్రం గొడవలు ఆగలేదు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున అనూష దారుణానికి ఒడిగట్టింది. నిద్రపోతున్న భర్త మీద వేడినీళ్లు పోసింది. సలసలా కాగుతున్న వేడినీళ్లను తీసుకొచ్చిన అనూష.. మంచి నిద్రలో ఉన్న ప్రభుదాస్ మర్మాంగం మీద పోసింది. దీంతో ప్రభుదాస్ బాధతో విలవిల్లాడిపోయాడు. గట్టిగా కేకలు వేశాడు. బాధితుడి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాగా కాలుకున్న వేడినీళ్లు పడటంతో మర్మాంగంతో పాటుగా ప్రభుదాస్ కడుపుభాగంలో గాయాలయ్యాయి.


అయితే తన భార్య ప్రవర్తన వెనుక అత్తామామల కుట్ర ఉందంటున్నారు ప్రభుదాస్. తనను చంపించేందుకు వాళ్లు కుట్రలు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎంత విభేదాలు ఉంటే మాత్రం మొగుడి పట్ల ఇలా ప్రవర్తిస్తారా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. విభేదాలు ఉంటే కూర్చుని చర్చించికోవాలని సూచిస్తున్నారు. అప్పటికీ కలిసి ఉండలేమని భావిస్తే చట్టం ప్రకారం విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ఇంత కర్కశంగా వ్యవహరించడం ఏమిటని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com