రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు మేజర్లు ఏకాభిప్రాయంతో వివాహేతర శృంగారం చేస్తే నేరంగా పరిగణించలేమని తెలిపింది. ఓ వ్యక్తి తన భార్యను ముగ్గురు కిడ్నాప్ చేశారని పిటిషన్ వేశారు. కోర్టులో హాజరైన భార్య.. ముగ్గురిలో ఒకరితో తాను సహజీవనం చేస్తున్నానని చెప్పింది. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆమెను శిక్షించాలని భర్త తరపు న్యాయవాది కోర్టును కోరగా.. ఆమె చేసిన పనిని నేరంగా పరిగణించలేమని కోర్టు తేల్చి చెప్పింది.