నందిగామలో దాడి ఘటనపై టీడీపీ బృందం ఏసీపీకి ఫిర్యాదు చేసింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడుతూ.. నందిగామలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం అమానవీయ ఘటన అన్నారు. ఎవరైతే దాడి చేశారో వాళ్లే హాస్పటల్‌కి వెళ్లి మాపై దాడి చేశారంటూ సెక్షన్ 3 బనాయించాలని చూస్తున్నారన్నారు. దాడి చేసే సమయంలో వీడియోలు ఉన్నాయన్నారు. ఇవన్నీ పోలీసులకు వివరించామని సౌమ్య తెలిపారు. నందిగామలో శాంతి భద్రతలు పరిరక్షించాలి పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని సౌమ్య కోరారు. టీడీపీ నేత నెట్టెం రఘురాం మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పరిధిలో అధికారులు పనిచేయాలన్నారు. కౌంటర్ కేసులు ఇచ్చి కేసును బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు రేపు ఎన్నికల్లో గెలవలేక ఎలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడి ఘటనపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు దుర్మార్గమైన పాలన కొనసాగిందని నెట్టెం రఘురాం అన్నారు.