బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు గురువారం తమ స్వగ్రామమైన కారంచేడు లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు పోటీ చేస్తున్న నేపథ్యంలో విజయాన్ని కాంక్షిస్తూ ఈ పూజలు జరిపారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వారిచేత పూజలు చేయించి ఆశీర్వచనాలు ఇచ్చారు. పార్టీ నేతలు పాల్గొన్నారు.