బుధవారం మధ్యాహ్నం నుంచి వాట్సాప్ సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొన్నట్లు ప్రాథమిక నివేధికలు వెలుబడ్డాయి. ఒక్కసారిగా వాట్సాప్ సేవలు డౌన్ కావడంతో..2 బిలియన్ల వినియోగదారులపై ప్రభావం చూపింది. అనేక దేశాలలో WhatsApp కి కనెక్ట్ చేయడంలో వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో యూజర్ల చేసే మేసేజులు కేవలం సెండ్ మాత్రమే అయ్యాయి. కానీ డెలివరీ అవ్వడంలో మాత్రం తీవ్ర జాప్యం ఏర్పడింది.దీంతో యూజర్లు మెటా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ పరిస్థితి భారత్ లో అంతగా కనిపించకపోవడం గమనార్హం. కాగా కొద్ది గంటల తర్వాత మెటా ఈ సమస్యను పరిష్కరించి నట్లు తెలుస్తోంది. వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు వెంటనే మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లపై దృష్టి సారించి తమ సందేశాలను పంచుకున్నారు.