వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ఎనిమిదవ రోజు భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం వద్ద నుంచి సీఎం బయల్దేరారు. గురవరాజుపల్లెలో సీఎం వైయస్ జగన్‌కు ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. యాత్రకు తరలివచ్చిన అభిమానులు, ప్రజలు, వైయస్ఆర్ సీపీ శ్రేణులకు అభివాదం చేస్తూ సీఎం వైయస్ జగన్ ముందుకు కదిలారు. మరికొద్దిసేపటిలో `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ఏర్పేడుకు చేరుకోనుంది. ఏర్పేడు చౌరస్తాకి భారీగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. బస్సు యాత్రలో వస్తున్న సీఎం వైయస్ జగన్‌కు గజమాలతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. బస్సు యాత్ర ఎనిమిదవ రోజు ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లో తో ముఖముఖిలో పాల్గొంటారు. అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం సాయంత్రం 3:30 గంటలకు నాయుడుపేట నుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్ , మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు.