టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నరసాపురంలో నిర్వహించే బహిరంగ సభకు కూటమి భారీ జన సమీకరణకు సన్నాహాలు చేస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చంద్ర బాబు హెలికాఫ్టర్‌లో దిగనున్నారు. అక్కడి నుంచి నరసాపురం వరకు రోడ్ షో నిర్వహించి, సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు భారీగా జన సమీకరణ చేయాలని బుధవారం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు నిర్ణయించారు. నరసాపురం, మొగల్తూరు మండలాలతోపాటు పట్టణం నుంచి 30 వేల మందిని సమీక రించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వార్డులు, గ్రామాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించాలని నిర్ణయించారు. గ్రామాల నుంచి వచ్చే వారికి ఆటోలు ఏర్పాటు చేయనున్నారు. హెలిప్యాడ్‌ను బుధవారం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు టీడీపీ, జనసేన శ్రేణులతో కలిసి పరిశీలించారు.